చరిత్రను తిరిగి చూడు
( కీర్తనలు 78:42,43 )
“ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు… ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.”
నీ కోసం దేవుడు ఏమి చేశారు? అయితే వారు వాగ్దానం చేయబడిన భూమికి వెళ్లడానికి త్రోవలో ఎన్నో అద్భుతాలను వారు చూసిన కాని అవసరమైన సమయములో చూపవలసిన విశ్వాసం చూపని ఇశ్రాయేలీయులలాగ నీవు ఉండకూడదు. నీవు అనుభవించిన ఆ విజయాలు నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించడానికి లేదా నిన్ను స్వస్థపరచటానికి మాత్రమే కాదు. అవి నీలో బలాన్ని, నమ్మకాన్ని నింపుతున్నాయి. నీవు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు, పెద్దవిగా కనిపించే ఆ అడ్డంకులనుబట్టి, ఇంతకుముందు దేవుడు ఏమి చేశారో గుర్తుకు తెచ్చుకో. అదే నీకు విశ్వాసమును, నమ్మకమును పెంచుతుంది. మరియు సమస్తము ఆయన తన అరచేతుల్లో నిన్ను ఉంచుకొని నిన్ను ఆటంకపరచే ప్రతీ దానిని అణచివేయగలరని గ్రహించగలవు. నిన్ను ఆపడానికి శత్రువు ప్రయత్నిస్తున్న ఉత్తమ ప్రయత్నము లెన్నయినాగాని నీపైన అది ఉత్తమముగా పనిచేయదు. నీకు వ్యతిరేకంగా వున్న శక్తులకంటే నీ దగ్గర వున్న శక్తి గొప్పది. కనుక కలతచెందకు, భయపడకు. నీ గత జయముల చరిత్రను తిరిగి చూడు. ఆయన చేసినదానికి నీవు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, మీ హృదయంలో విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు దేవుడు నీ కోసం గతములో చేసినట్లే, ఆయన ఈ దినము కూడా నీ కోసం చేయగలరు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రి, నాకు మీతో ఉన్న చరిత్రనుబట్టి ప్రతిసారీ మీరు శత్రువుకు నాపై విజయానికి అనుమతించలేదని మీకు వందనములు. మీరు మీ అరచేతుల్లో నన్ను కలిగి ఉన్నా అన్నిసమయములనుబట్టి కృతజ్ఞతలను చెల్లంచుచున్నాను. వీటి ద్వారా నేను ఈ దినము విజయం సాధించగలనని నమ్ముచూ యేసునామములో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమెన్.