“... యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించు చున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” ( యిర్మియా 33:11 )
ఈ దిన వాక్యములో దేవుడు, బబులోనుకు బంధీలుగా తీసుకువెళ్ళబడిన తన ప్రజలతో
“ మీకు ఏమీ జరగనప్పటికీ మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి, స్తుతియాగమును చేయుట ద్వార , దేవుడు మీ ప్రతికూలపరిస్థితులు మార్చి, దొంగిలించబడిన వాటిని తిరిగి పునరుద్ధరించనున్నారని” చెప్తున్నారు. అది ఎలా పనిజరిగిస్తుందో నీవు చూడలేనప్పటికీ నీవు దినమంతా, “తండ్రీ, నా కొరకైన సమాధానం దారిలో ఉన్నందుకు వందనములు; ఈ సమస్య మలుపు తిరిగినందుకు వందనములు, ” అని చెబుతూ సిద్ధంగా ఉండు. ఎందుకంటే దేవుడు వాటిని తిరిగి పునరుద్ధరించబోతున్నారు. ఆయన క్షీణించిన ఆర్థిక పరిస్థితులను త్రిప్పి వేయబోతున్నారు. చెడుగానున్న ఆరోగ్య నివేదికను త్రిప్పి వ్రాయబోతున్నారు. చట్టపరమైన విషయాన్ని త్రిప్పి వేస్తారు మరియు ఆయన - నీది అనేవాటిని తిరిగి పునరుద్ధరించబోతున్నారు. ఎవరో నీకు అన్యాయం చేసినందున నీవు కోల్పోయిన సంవత్సరాలను తిరిగి పునరుద్ధరించబోతున్నారు. ఆయన కష్టములలో వున్న నీ సంబంధాల్ని పునరుద్ధరించబోతున్నారు.నీ శరీరానికి ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తారు. ఇది నీ స్తుతులమూలముగా జరగబోతోంది, కాబట్టి వాటిని చెల్లించటము ప్రారంభించు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, నేను ఎదుర్కొనే ఏ కష్టాలకన్నా మీరు పెద్దవారని మీకు వందనములు. మీరు సర్వ సృష్టికర్త, మరియు నేను మీకు స్తుతియాగములను మరియు నా హృదయ లోతైన ఆరాధనను అందిస్తున్నాను. నాకు ఉండాల్సిన దానిని మీరు తిరిగి పునరుద్ధరిస్తారని నమ్ముచూ యేసు నామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.