“ యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లి పోయెను. అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి. “
( యోహాను 4:50,51 )
మరణానికి దగ్గరగా ఉన్న తన కొడుకును స్వస్థపరచమని ఒక అధికారి యేసయ్య వద్దకు వచ్చి వేడుకున్నాడు. యేసయ్య ప్రార్థన చేయలేదు లేదా ఎక్కువ సమయం తీసుకోలేదు. అయినా బాలుడు స్వస్థత పొందాడని మరియు అధికారిని ఇంటికి వెళ్ళమని శెలవిచ్చారు. - నేను ఇంటికి తిరిగి వెళ్ళే సమయమునకు అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కనీసము ఆయన ప్రార్థన కూడా చేయలేదు అని ఆ అధికారి ఆలోచించి ఉండవచ్చు. అయినా కానీ అతను దేవుని మాటనమ్మి వెళ్లి పోయాడు మరియు "నీ కుమారుడు బ్రదికియున్నాడని" యేసయ్య చెప్పిన సమయానికే తన కొడుకు స్వస్థత పొందాడని దారిలోనే తెలిసికున్నాడు.
ఈ మనిషిలాగే, దేవుడు నీతో మాట్లాడిన వాగ్దానాలు ఉన్నాయి. నీ హృదయంలో నీకు తెలిసి జరుగుతాయన్న విషయాలు -వైద్యంలోను, ప్రమోషన్లోను, ఆత్మీయ సంబంధాలలోను వుండవచ్చు . నీవు చింతించకూడదని నిర్ణయం తీసుకో, నీవు ఎప్పటికీ జరగదని అనుకుంటూ సందేహించకు. దేవుడు చెప్పిన క్షణం, ఆయన దానిని విడుదల చేస్తారని తెలిసి విశ్వాసంతో ఉండు. అది ఇప్పటికే నీ భవిష్యత్తులో ఉంది మరియు నీ దారిలోనే ఉంది.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, మీ మంచితనమునుబట్టి మరియు అనుగ్రహమునుబట్టి వందనములు మరియు మీరు మీ మాటకు నమ్మకంగా వుండగా నేను మీ మాటనే తీసికొనుచూ , మీ దగ్గర నా కొరకు కొన్ని ఊహించనివి ఉన్నాయని నేను నమ్ముచున్నాను.
ఇది అనుకున్న దానికంటే త్వరగా జరుగుతుందని నేను నమ్ముచూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.