“ నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.”
( కీర్తనలు 41:11 )

ఈ దిన వాక్యములో, దావీదు తాను రాజుగా ఉన్న చోటును చూసి, తాను అక్కడికి చేరిన మార్గమును గురించి ఆలోచించినప్పుడు - సౌలు రాజు అతన్ని చంపడానికి చేస్తున్న ప్రయత్నమును , ప్రజలు చేసిన మోసమును, సైన్యాలు అతనిపై చేసిన దాడిని గురించి,
వీటన్నింటి వెనుక శత్రువులు అతన్ని ఓడించనివ్వకుండునట్లు దేవుడు తన వెనుక కార్యమును జరిగిస్తున్నారని గ్రహించాడు. ప్రభువు తన పక్షమున ఉన్నారని అతనికి తెలుసు కాబట్టి అది అతనికి ధైర్యాన్ని ఇచ్చింది.

వీటిలో కొన్ని “దీని ద్వారా నేను గ్రహించినది” అనే అనుభవాలు మనందరికీ ఉన్నాయి. నీవు ఆ అనారోగ్యం నుండి ఎలా బయటపడ్డావో, కాలేజీచదువులలో పొందిన అనుభవాలు, ఆ వ్యసనాలనుండి ఎలా విడిపించ బడ్డావో నీవు తిరిగి చూసినప్పుడు, అది దేవుని దయవల్ల మాత్రమే అని నీవు గ్రహించగలవు. దానినిబట్టే ఇప్పుడు సజీవముగా ఉన్నావు. ప్రభువు నీ వైపు ఉన్నాడని నీకు తెలిసినప్పుడు, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. వ్యతిరేకత వచ్చినప్పుడు నీవు పడిపోవు. మర్మము ఏమిటి అని ఎవరయినా అడిగితే “ నాకు ఒక రహస్యం ఉంది అది సర్వోన్నతుడైన దేవుడు నా వైపు ఉన్నాడు “ అని చెప్పగలవు. అదే నీ వైఖరిగాను వుంటుంది.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, నేను మీతో ఉన్న సమయములనుబట్టి వందనములు మరియు ప్రతిసారీ మీరు నాపై విజయం సాధించడానికి శత్రువును అనుమతించలేదని,
మీరు నా వైపు ఉన్నారని మీరు నాకు చూపించిన అన్ని కార్యములనుబట్టి వందనములు . దీని ద్వారా నేను విజయం సాధించగలనని నమ్ముచూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.